కస్టమర్లకు షాకిస్తున్న SBI… ఆ ఛార్జీలను పెంచేసింది!

ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి తాజాగా ఆ బ్యాంకు భారీ షాక్ ఇచ్చింది.ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ బ్యాంకు ప్రకటించడంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు యూజర్లపై ఇప్పుడు భారం పడనుంది.

 Sbi Is Shocking The Customers Has Increased The Charges-TeluguStop.com

ఎస్‌బీఐ కార్డు ఈసారిగా నవంబర్ 15 నుంచి క్రెడిట్ కార్డు పేమెంట్లపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది.ఇంతకుముందు ఈ ఛార్జీలు సున్నాగా ఉండేవి.

నవంబర్ 15 తర్వాత పెరగని ఈ ఛార్జీలు ఇప్పుడు పెరిగాయి.ఎస్‌బీఐ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా హౌజ్ రెంట్ పేమెంట్స్‌పై ఛార్జీలను పెంచింది.

ఇలా చేసుకుంటే జస్ట్ నాలుగు నెలల కాలంలో ఎస్‌బీఐ బ్యాంక్ రెండు సార్లు ఛార్జీలను పెంచినట్లు స్పష్టమవుతుంది.

Telugu Fees, Sbi-Latest News - Telugu

నవంబర్ 15 నుంచి ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే రెంట్ పేమెంట్స్‌పై రూ.99 ప్రాసెసింగ్ ఫీజును వడ్డిస్తూ వస్తోంది.అంతేకాదు దీనికి అదనంగా జీఎస్‌టీ కట్టాల్సి రావడం వల్ల యూజర్ల పై భారం పడుతుంది.

ఇకపోతే ఇతర బ్యాంకులు కూడా ప్రాసెసింగ్ ఫీజు అంటూ కస్టమర్ల నుంచి డబ్బులు లాగేస్తున్నాయి.ఎస్‌బీఐ తాజాగా పెంచిన ఛార్జీలు మార్చి 17 నుంచి అమల్లోకి రానున్నాయి.ఆ తేదీ నుంచి అద్దె చెల్లింపులపై రూ.99 కాకుండా రూ.199 ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది.

Telugu Fees, Sbi-Latest News - Telugu

ఈ రెంట్ పేమెంట్లపై ప్రాసెసింగ్ ఫీజు చార్జీలను పెంచుతున్నట్లు ఇప్పటికే ఎస్‌బీఐ కార్డు తన కస్టమర్లకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది.కొత్త చార్జీలు అమల్లోకి రావడానికి ఇంకా దాదాపు నెల రోజుల సమయం ఉంది కాబట్టి రెంటు కట్టేవారు చార్జీలు పడకుండా ఉండాలంటే తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్ సహా ఇతర బ్యాంకులు క్రెడిట్ కార్డు ద్వారా చేసే అద్దె చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజును కలెక్ట్ చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube