ప‌లు వ్యాపారాల్లో విఫలమైన రాధాకిషన్... డీమార్ట్‌ని విజ‌యవంతంగా ఎలా న‌డిపిస్తున్నారంటే...

డీమార్ట్‌ దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది.వీటిలో ఎక్కువ దుకాణాలు మహారాష్ట్రలో ఉన్నాయి.

 Radhakishan How Is He Running Demart Successfully , Demart, Radhakishan, Radhak-TeluguStop.com

వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ 20 ఏళ్లలో ఈ సంస్థను ఆకాశం అంత ఎత్తుకు తీసుకువెళ్లారు.దమానీ అరబ్బుల సామ్రాజ్యం నెల‌కొల్పారు.

కానీ ఈ ఎత్తుకు చేరుకునే ప్రయాణం అంత సులభం కాలేదు.దమానీ సంస్థ కోసం పగల‌న‌క‌, రాత్ర‌న‌క‌ చాలా కష్టపడ్డారు.

కంపెనీ పునాది వేశారు.వ్యూహం రూపొందించి అమలు చేశారు.

దీని తరువాత డీమార్ట్‌ ఇంత పెద్ద వ్యాపారం నిర్వ‌హించే స్థాయికి వచ్చింది.ప్రపంచంలోని 500 మంది సంపన్నుల జాబితాలో దమానీకి చోటు దక్కింది.

డిమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ 1954లో ముంబైలోని మార్వాడీ కుటుంబంలో జన్మించారు.బి.కాం చ‌దివేందుకు ముంబై యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు.అయితే ఏడాది తర్వాత చదువు మానేసి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు.

దమానీ మొదట బాల్ బేరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించారు.కానీ అందులో విజయం సాధించలేదు.

దీంతో ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టారు.ఈ సమయంలో అతని తండ్రి మరణించాడు.

Telugu Demart, Demart Powai, Mumbai, Radhakishan-Latest News - Telugu

దమానీ స్టాక్ మార్కెట్లో రూ.5,000 పెట్టుబడి పెట్టారు.అతను మొదట ఈ వ్యాపారాన్ని అర్థం చేసుకున్నారు.చిన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు.దీని ద్వారా దమానీ బాగా డబ్బు సంపాదించారు.1999 సంవత్సరంలో అతను ముంబైలోని నెరుల్‌లో మార్కెట్ ఫ్రాంచైజీని ప్రారంభించారు.అయితే ఇందులో అతనికి విజయం దక్కలేదు.దీని తర్వాత అతను డిమార్ట్ వ్యాపారంలో అడుగుపెట్టారు.2002లో దమానీ ముంబైలోని పోవైలో డీమార్ట్‌ పేరుతో స్టోర్‌ను ప్రారంభించారు.ఇందులో విజయం సాధించారు.

అనంతరం దుకాణాల సంఖ్యను పెంచే పనికి శ్రీకారం చుట్టారు.దమానీ తాను ఏ దుకాణాన్ని అద్దెకు తీసుకోకూడ‌ద‌నే విధానాన్ని అనుసరించారు.

అతను ఎక్కడ దుకాణం తెరిచినా అది అతని సొంతానిదే.డీమార్ట్ బ్రాంచీలు నేడు దేశంలో 300 కంటే ఎక్కువ ఉన్నాయి.

అన్నీ కంపెనీ యాజమాన్యంలో ఉన్నాయి.డిమార్ట్ కంపెనీ రాయితీ ఆలోచన ఫలించింది.

జనాలకు బాగా నచ్చింది.సంస్థ ఉవ్వెత్తున విజ‌యాన్ని అందుకుంది.

ప్రస్తుతం డిమార్ట్ సామాన్యుల ఎంపికగా మారింది.ఇక్కడ భారీ రాయితీల‌కు ప‌లు వస్తువులు లభిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube