పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించే సూపర్ ఎఫెక్టివ్‌ రెమెడీ మీకోసం!

ప్రసవం అనంతరం ప్రతి మహిళా సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ ముందు వర‌స‌లో ఉంటుంది.ముఖ్యంగా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా అధికంగా పడుతుంటాయి.

 A Super Effective Remedy To Get Rid Of Stretch Marks On The Stomach Is For You D-TeluguStop.com

దీని కారణంగా అక్కడి చర్మం అస‌హ్యంగా మారుతుంది.ఈ క్రమంలోనే స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవడం కోసం తోచిన చిట్కాలను ప్రయత్నిస్తుంటారు.

అలాగే కొందరు మార్కెట్లో లభ్యమయ్యే స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వాడుతుంటారు.మరికొందరైతే ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే న్యాచురల్ గా స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Telugu Remedy, Honey, Latest, Orange Peel, Rose, Skin Care, Skin Care Tips, Stre

మ‌రుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పును వేసుకోవాలి.అలాగే అరకప్పు నిమ్మ తొక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, ఆరు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్‌ సహాయంతో స్మూత్ పేస్ట్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Remedy, Honey, Latest, Orange Peel, Rose, Skin Care, Skin Care Tips, Stre

ఈ స్మూత్ పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొట్టపైన అప్లై చేసుకుని స్మూత్ గా కాసేపు రబ్ చేసుకోవాలి.ఆపై పూర్తిగా ఆరనిచ్చి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.అనంతరం మాయిశ్చరైజ‌ర్ ను పొట్టపై అప్లై చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ చిట్కాను కనుక పాటిస్తే స్ట్రెచ్ మార్క్స్ దెబ్బకు పరారవుతాయి.పొట్ట వద్ద చర్మం మళ్లీ టైట్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube