నేటి యువత తమ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అలసిపోయి నీరుగారి పోతున్నారు.ఈ క్రమంలో కొన్ని చోట్ల ఆత్యహత్యలు వంటివి చోటుచేసుకుంటున్నాయి.10 క్లాస్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, ఇంటర్లో ఫెయిల్ అయ్యామనో, లేదంటే ఇంజనీరింగ్, IIT, మెడిసన్… ఇలా రకరకాల కోర్సులు చేసే క్రమంలో కాస్త వెనకబడ్డ విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై తనువులు చాలించిన ఘటనలు మనం ఎన్నింటినో చూసాం, చూస్తున్నాం.అయితే అలాంటివారు ఒక్కసారి ఇలాంటి బామ్మ గురించి వింటే ఎంతోకొంత నేర్చుకోక మానరు.

అవును, తాజాగా ఓ 104 ఏళ్ల బామ్మ ఓ అద్భుతాన్ని చేసింది.కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లిటరసీ టెస్ట్ లో 100 కు 89 మార్కులు సాధించింది రికార్డు సృష్టించింది.దాంతో ఆమెను కీర్తిస్తూ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం ఈ వార్త నెటింట్లో తెగ వైరల్ అవుతోంది.ఆయన తరచూ ప్రేరణాత్మకు వీడియోలను, ఫోటోలోను షేర్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈ బామ్మ ఆనంద్ మహీంద్ర మనసుని దోచుకుంది.
దాంతో ఈ బామ్మకి సంబంధించినటువంటి ఆర్టికల్ అతని ట్విట్టర్ వేదికలో చోటు సంపాదించుకుంది.

ఆమె ఎవరంటే? కేరళ రాష్ట్రానికి చెందిన 104 ఏళ్ల కుట్టియమ్మ. ఆ రాష్ట్రం నిర్వహించిన అక్షరాస్యత మిషన్ పరీక్షలో 89/100 మార్కులు సాధించి, అందరినీ వెనక్కి నెట్టింది.కాగా తాను అనుకున్నది చివరకు సాధించడంతో చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ఆమె యువతకు సందేశం ఇస్తోంది.మీ కలల కోసం పోరాడండి, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు! అంటూ సందేశం ఇస్తోంది.
కాగా ఆమెకు దేశం నలువైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.ఆనంద్ మహీంద్ర దాన్ని షేర్ చేస్తూ… “పాఠశాలకు వెళ్లే ప్రతి చిన్నారికి ఈ బామ్మ కథ ఒక పాఠంగా నిలుస్తుంది.” అంటూ పోస్ట్ చేశారు.







