తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బండ్ల గణేష్ పొగడ్తలు..!!

సినీ నటుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అందరికీ సుపరిచితుడే.కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఆ తర్వాత వ్యాపార రంగంలో విజయవంతంగా రాణించటం జరిగింది.

 Bandla Ganesh Praises Telangana Chief Minister Kcr Details, Bandla Ganesh, Cm Kc-TeluguStop.com

తర్వాత తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో.కీలక నేతగా రాణించారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బండ్ల గణేష్ సైలెంట్ అయిపోయారు.ఆ తర్వాత నుండి రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉంటూ సినిమా రంగంలో ఇంకా వ్యాపార రంగంలో యధావిధిగా రాణిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని ఈ రోజు ఉదయం బండ్ల గణేష్ భార్యతో కలిసి సందర్శించారు.

అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపించారు.“ఎన్నో రోజుల నుంచి శ్రీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.ఆ స్వామివారి అనుగ్రహం లేక నాకు రావటం కుదరలేదు.

కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి శ్రీ కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు.

తెలంగాణ అద్భుతమైన ప్రగతి పదం వైపు దూసుకుపోతుంది అని చెప్పటానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం.

శ్రీ కేసీఆర్ గారి ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానంగానీ మహా అద్భుతంగా తృప్తి చెందాను.చాలా సంతోషం అనిపించింది.ముఖ్యమంత్రి గారు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నాను.

మీరు ఈ రాష్ట్రానికే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పదం వైపు నడిపించే సత్తా, సామర్థ్యత మీకు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను ఈ యాదగిరి నరసింహస్వామి ఆలయం చూశాక…మీ మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మీ మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న మీ సంకల్పం చాలా గొప్పది.

ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి మీ అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈరోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో మీ ఆలోచన విధానం, మీ కఠోర తపస్సు, మీ ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడింది, ఆనందాన్నిస్తుంది.నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు మీపై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు మీ మీద ఉండాలని మా ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్.

ఏ స్వార్థం కోసమో.ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు.నా మనసులోని మాటలు చెప్తున్నాను.మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను.

అది నా నైజం సార్.! మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.

లవ్ యు కేసీఆర్ గారు”.అనీ ట్విటర్లో బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube