ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు థియేటరల్లలో ఓటీటీలలో విడుదలవుతున్నాయి.ప్రేక్షకులు సైతం వీకెండ్ రాగానే బెస్ట్ సినిమాలను ఎంచుకుని ఆ సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ వారం విడుదలవుతున్న సినిమాలలో సార్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఫిబ్రవరి 17వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం.

మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ధనుష్ కోరుకున్న భారీ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.అల వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహ షెహ్ జాదా రిలీజ్ అవుతోంది.కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ మూవీ ఈ నెల 18వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది.
నంబర్ నైబరింగ్ నే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది.

ఊ అంటావా మావ ఊఊ అంటావా మావా కూడా 18వ తేదీనే థియేటర్లలో విడుదలవుతోంది.ఓటీటీల విషయానికి వస్తే కార్నివాల్ రో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండగా మాలికాపురం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.హాట్ స్టార్ లో సదా నన్ను నడిపే, జె హోప్ ఇన్ ది బాక్స్ కొరియన్ సిరీస్, ద నైట్ మేనేజర్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆహా ఓటీటీలో ఈ నెల 17వ తేదీన కళ్యాణం కమనీయం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్ ఆన్ ది రాక్, మైనస్ వన్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే స్వేర్ లవ్ ఆల్ ఓవర్ అగైన్, అన్ లాక్ కొరియన్ సిరీస్, గ్యాంగ్ లాండ్స్ వెబ్ సిరీస్, రెడ్ రోజ్ వెబ్ సిరీస్, సర్కస్, ఫుల్ స్వింగ్, ఆఫ్రికన్ క్వీన్స్ జింగా వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి.ది రొమాంటిక్స్, పర్ఫెక్ట్ మ్యాచ్, ఏ సండే ఎఫైర్ కూడా వాలెంటైన్స్ డే నుంచి స్ట్రీమింగ్ కానున్నాయని సమాచారం అందుతోంది.







