అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇసుక తవ్వకాల కారణంగా పెద్ద ప్రమాదం పొంచి ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.ఇందుకు బాధ్యులైన పదమూడు మంది అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ సమాధానం మూడు రోజుల్లో చెప్పాలని సూచించారు.ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు రైతులు నీటిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతామని అంటున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తను కూడా వాళ్లతో కలిసి దూకుతానంటూ హెచ్చరించారు.
వనరులను కాపాడేందుకు చావుకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.







