టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా సమాజ సేవ చేయడంలో కూడా బాలయ్య బాబు ముందే ఉంటారు అన్న విషయం తెలిసిందే.ఎంతోమందికి సహాయం చేసి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు బాలయ్య బాబు.
ఇప్పటికే ఎంతోమందికి బాలయ్య బాబు సహాయం చేసిన విషయం తెలిసిందే.అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అధినేతగా ఇప్పటికే ఎంతోమందికి ఆపన్న హస్తమును అందించారు.
క్యాన్సర్ విషయంలో తన తల్లికి జరిగినట్టు మరెవరికి జరగకూడదు అన్న ఉద్దేశంతో బాలయ్య బాబు ఆసుపత్రిని ప్రారంభించిన విషయం తెలిసిందే.ఆ హాస్పిటల్లో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడంతోపాటుగా పేదలకు తన సొంత ఖర్చులతోనే ఆసుపత్రి బిల్లును కూడా చెల్లిస్తున్నారు బాలయ్య బాబు.
ఇకపోతే తాజాగా కూడా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు బాలకృష్ణ.
![]()
టాలీవుడ్ కి చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని తెలుసుకున్న బాలయ్య బాబు వెంటనే అతనికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందించి ప్రాణాలను కాపాడారు.డైరెక్టర్ బోయపాటి శ్రీను వద్ద మహేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.అతను రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు.
![]()
అయితే మహేష్ యాదవ్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి నయం కావాలంటే సుమారుగా 40 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పడంతో వెంటనే బోయపాటి ద్వారా మహేష్ యాదవ్ విషయం తెలుసుకున్న బాలయ్య బాబు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా చర్యలు తీసుకుని ఉచితంగా చికిత్సను చేయించారు.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య బాబు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.బాలయ్య బాబు మనసు బంగారం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.






