అఖిలప్రియ సీటుకి ఎర్త్ పెడుతోంది ఎవరు ? 

ఓడలు బళ్లు.బళ్లు ఓడలు అవ్వడం అంటే ఏంటో టిడిపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలో నిరూపితం అవుతుంది.నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గం లో భూమా కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడంతో పాటు, ఆ కుటుంబానికి కంచుకోటగా నియోజకవర్గాలు ఉంటూ వస్తున్నాయి.2014లో వైసీపీ నుంచి గెలిచిన భూమా అఖిలప్రియ ఆ తరువాత టిడిపిలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆమె గ్రాఫ్ తగ్గుతూనే వస్తోంది.

 Bhuma Akhila Priya Vs Av Subbareddy In Allagadda Constituency Details, Bhuma Akh-TeluguStop.com

దీనికి కారణం వ్యక్తిగతంగా ను ఆమె అనేక వివాదాల్లో చిక్కుకోవడం, పోలీసు కేసులు నమోదవడం ఇవన్నీ ఇబ్బందికరంగా మారాయి.

ముఖ్యంగా హైదరాబాదులో ఓకే కిడ్నాప్ కేసు, స్థల వివాదం, ఆదాయ పన్ను అధికారులుగా చెప్పుకుని బెదిరింపులకు పాల్పడడం ఎలా ఎన్నో కేసులు ఆమెను చుట్టుముట్టాయి.ముఖ్యంగా ఆమె రెండవ వివాహం చేసుకున్న తర్వాత వివాదాస్పదం అయ్యారు.

దీంతో క్రమక్రమంగా ఆమె గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది.

Telugu Allagadda, Bhargav Ram, Bonda Uma, Chandrababu, Akhilapriya, Jagan, Nandh

తమ కుటుంబానికి గట్టుపట్టున్న ఆళ్లగడ్డ,  నంద్యాల నియోజకవర్గం లో  ఏర్పడింది.రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేందుకు అఖిల ప్రయత్నాలు చేస్తూ ఉండగా, ఇప్పుడు అక్కడ అఖిల ప్రియ కు ప్రత్యర్థిగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి  పేరు మారుమోగుతోంది.రాబోయే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.

ఆయనతో వియ్యం అందుకున్న విజయవాడ తెలుగుదేశం కీలక నేత బోండా ఉమ ఆళ్లగడ్డలో తన వియ్యంకుడు సుబ్బారెడ్డి కి టికెట్ ఇప్పులించుకోడం తో పాటు,  గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Telugu Allagadda, Bhargav Ram, Bonda Uma, Chandrababu, Akhilapriya, Jagan, Nandh

ఈ మేరకు చంద్రబాబుతోను బోండా ఉమ ఈ వ్యవహారాలపై చర్చించారని, ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాబు కూడా సుబ్బారెడ్డి వైపు మొగ్గు చూపునట్లు సమాచారం.ఆళ్లగడ్డ లో సుబ్బారెడ్డి పేరు చంద్రబాబు ప్రకటిస్తే అఖిల రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడినట్లే.పోనీ ఆమె వైసీపీలో కి వెళదాము అన్నా.

అక్కడ ఆమెను చేర్చుకునేందుకు జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube