గత బుధవారం కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే.
ఆయిల్ కంపెనీకి చెందిన పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేయడానికి దిగి ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు.దీంతో సదరు ఆయిల్ కంపెనీ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలకు దిగింది.
ఫ్యాక్టరీని సీజ్ చేసిన అధికారులు.క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.
అంతేకాదు ప్రమాదం జరిగిన ఆయిల్ పరిశ్రమ యూనిట్ లో తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది.

ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు కాకినాడ జిజిహెచ్ ఆవరణలో తక్షిణ సాయం కింద 50 వేల రూపాయలు నగదు చొప్పున అధికారులు అందించడం జరిగింది.ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం నుండి ₹25లక్షలు, ప్రభుత్వం నుండి ₹25 లక్షలు మొత్తం 50 లక్షలు… పరిహారంగా ప్రకటించడం జరిగింది.ఇదంతా పక్కన పెడితే ఆయిల్ ప్రమాదంపై విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.
వారిని మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు.ఈ క్రమంలో నిందితులకు 14 రోజుల రిమాండ్.
విధించడంతో పెద్దాపురం సబ్ జైలుకు తరలించారు.







