''రావణాసుర'' నుండి కొత్త అప్డేట్.. మాస్ రాజా తగ్గేదేలే!

మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు.ప్రతీ ఏడాది మూడు నాలుగు సినిమాలు చేస్తూ రవితేజ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తూ ఉంటాడు.

 Ravi Teja's New Film Ravanasura's Latest Update , Ravanasura, Ravi Teja, Latest-TeluguStop.com

ఇక ఈ మధ్యనే రవితేజ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లను అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు.గత డిసెంబర్ లో మాస్ రాజా ‘ధమాకా’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ సినిమా తర్వాత వాల్తేరు వీరయ్యతో మరో హిట్ అందుకున్నాడు.

రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న రవితేజ తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు.ప్రెజెంట్ రవితేజ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ”రావణాసుర”.

ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

మరి రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా చేస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్.తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు.రేపు ఉదయం 10 గంటల 8 నిముషాలకు మరో కొత్త అప్డేట్ ను రివీల్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ వారు అనౌన్స్ చేయడంతో ఈ అప్డేట్ ఏంటా అని అంతా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube