ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు ప్రభాస్ మరో ఛాన్స్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

బాహుబలి సినిమాతో వచ్చిన పాన్ ఇండియా స్టార్ డమ్ ను ప్రభాస్ బాగా ఉపయోగించు కుంటున్నాడు.వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు.

 Prabhas Giving A Second Chance To Radha Krishna, Radha Krishna Kumar, Salaar ,-TeluguStop.com

వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు భారీ ప్లాప్ అయ్యాయి.

సాహో డిజాస్టర్ తర్వాత ప్రభాస్ చేసిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది.ఎన్నో హైప్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అలా ప్లాప్ అవుతుంది అని ప్రభాస్ కూడా ఊహించలేదు.

ఈ సినిమాను డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కించారు.అసలు ఈ స్టోరీని ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడు అని ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేసారంటే ఈ సినిమా వల్ల ఎంత నిరాశ చెందారో అర్ధం అవుతుంది.

Telugu Salaar, Pooja Hegde, Prabhas, Prabhaschance, Radhakrishna, Radhe Shyam, T

మరి అలాంటి డైరెక్టర్ కు ప్రభాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు అంటూ తాజాగా టాలీవుడ్ వర్గాల్లో బజ్ వైరల్ అవుతుంది.ఈ వార్త ప్రకారం ప్రభాస్ తన లైనప్ పూర్తీ అయిన తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు అని ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుందని టాక్.

Telugu Salaar, Pooja Hegde, Prabhas, Prabhaschance, Radhakrishna, Radhe Shyam, T

ఈ ప్రచారంలో ఎంత నిజమో తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ డైరెక్టర్ తో సినిమా అంటే భయ పడుతున్నారు.చూడాలి ఇది నిజమో కాదో తెలియాలంటే మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తే తప్ప నమ్మడానికి లేదు.ఇదిలా ఉండగా.ప్రెజెంట్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘సలార్’, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో మరో హారర్ సినిమా కూడా చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube