ప్రముఖ టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలపై ప్రధానంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.ప్రముఖ ఛానెళ్లలో ఒకటైన జీ తెలుగు ఛానెల్ లో ఓ రెండు ప్రేమ మేఘాలు పేరుతో ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఒక ఈవెంట్ ప్రసారమవుతోంది.
ఈ ఈవెంట్ లో నూకరాజు ఆసియాపై తన ప్రేమను వ్యక్తం చేసిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతుండటం గమనార్హం.
గత కొన్నిరోజులుగా నూకరాజు ఆసియా మధ్య బ్రేకప్ జరిగిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
నూకరాజు ఆసియాను పెళ్లి చేసుకోవడం నూకరాజు కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపించాయి.అయితే జీ తెలుగు ఈవెంట్ లో రోజురోజుకు ఆసియాపై తనకు ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని నూకరాజు పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు.
ఈ ఈవెంట్ లో శ్రియ తన భర్తతో కలిసి సందడి చేశారు.

భర్తతో కలిసి శ్రియ అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేయడంతో పాటు ముద్దులు పెట్టుకున్నారు.ప్రదీప్ నేను చూడలేదు చూడలేదు అని చెప్పగా శ్రియ మరోసారి తన భర్తకు లిప్ లాక్ ఇచ్చారు.ఆ తర్వాత నూకరాజు తన గుండెపై ఆసియా పేరుతో వేసుకున్న పచ్చబొట్టును చూపించారు.
తన పేరు ఉన్న టాటూను ఆసియా టచ్ చేయగా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఎన్ని వచ్చినా ఏమి వచ్చినా నేను అయితే నీ చెయ్యి వదలను అంటూ నూకరాజు ఆసియాపై ప్రేమను వ్యక్తం చేశారు.మనం ట్రూగా ప్రేమించిన అమ్మాయి మనకు కాకుండా దూరం అయిపోయిన సమయంలో ఆ క్షణాలు గుర్తొస్తే బాధగా ఉంటుందని నూకరాజు అన్నారు.ఒకవైపు కుటుంబం కావాలని మరోవైపు ప్రేమించిన అమ్మాయి కావాలని బాధలు ఒక్కోసారి గుర్తొస్తే చాలా హర్ట్ అవుతామని నూకరాజు కామెంట్లు చేశారు.







