మెట్రో రైలు టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోనేది లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని సూచించామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ విస్తరణకు కేంద్రం అడ్డుపడుతోందని కేటీఆర్ ఆరోపించారు.చిన్న నగరాలకు కోట్ల నిధులు ఇచ్చి హైదరాబాద్ కు ఇవ్వడం లేదని విమర్శించారు.
మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదన్న కేటీఆర్ ప్రతిపాదనలు పంపినా కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు.కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని మెట్రోలకే నిధులు ఇస్తోందన్నారు.
మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రోను విస్తరిస్తామని స్పష్టం చేశారు.







