సినిమా ఇండస్ట్రీ లో ఒక యాక్టర్ యాక్టింగ్ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు అంటే దాంట్లో డైరక్టర్ల గొప్పతనం చాలానే ఉంటుంది.ఎందుకంటే వాళ్ళు రాసిన మంచి క్యారెక్టర్స్ వల్లనే ఒక యాక్టర్ నిలబడతాడు అని చెప్పవచ్చు… అలా ప్రకాష్ రాజ్ కూడా నటుడిగా తెలుగు లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక ఐదుగురు దర్శకులు చాలా హెల్ప్ చేశారనే చెప్పాలి ఆ డైరెక్టర్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
ఈ లిస్ట్ లో మొదటి వ్యక్తి గుణశేఖర్.గుణశేఖర్ తీసిన చూడాలని ఉంది అనే సినిమాలో ప్రకాష్ రాజ్ కి మేన్ విలన్ పాత్రని ఇచ్చాడు.అప్పటి వరకు ప్రకాష్ రాజ్ కెరియర్ అప్స్ అండ్ డౌన్ లో ఉండేది ఎప్పుడైతే ఈ సినిమా వచ్చిందో దాంతో ఆయన కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది… అప్పటి నుండి ఆయన వరుసగా చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేసాడు.గుణశేఖర్ చేసిన సినిమాల్లో మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాల్లో మంచి రోల్స్ ఇచ్చాడు.

ఈ లిస్ట్ లో గుణశేఖర్ తర్వాత కృష్ణవంశీ ఉంటాడు ఈయన చేసిన అంతఃపురం సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటించి చాలా అవార్డులు కూడా అందుకున్నాడు.అలాగే ఖడ్గం, మురారీ, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో కూడా మంచి పాత్రలు ఇచ్చి ఎంకరేజ్ చేసాడు.ఆ తరువాత పూరి జగన్నాథ్ బద్రి,ఇడియట్,అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి,పోకిరి లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు ఇచ్చి తన సక్సెస్ లో కీలక పాత్ర వహించారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ప్రకాష్ రాజ్ ఎదుగుదలకి చాలా హెల్ప్ చేసాడు త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు ఆయన రాసిన మంచి పాత్రలన్నీ ప్రకాష్ రాజ్ చేత చేయించేవారు నువ్వూ నాకు నచ్చావ్, చిరునవ్వుతో, నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా సినిమాల్లో ప్రకాష్ రాజ్ కి మంచి పాత్రలు రాశారు.వి వి వినాయక్ ఈయన చేసిన ఠాగూర్,దిల్,సాంబ,అల్లుడు శీను సినిమాల్లో ప్రకాష్ రాజ్ చాలా అద్బుతం గా నటించాడు.ఇక వీళ్ళ తర్వాత లిస్ట్ లో బొమ్మరిల్లు భాస్కర్,శ్రీకాంత్ అడ్డాల లాంటి వారు ఉంటారు.








