ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న కంటెంట్ ఏదన్నా వుంది అంటే అది ChatGpt.అవును, ChatGpt ఇపుడు విశేష ఆదరణతో దూసుకుపోతోంది.
ఈ తరుణంలో మరో సంచలనం నమోదు చేసి రికార్డులు సృష్టించింది.ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు ChatGpt ఒక హాట్ టాపిక్.
ChatGpt అంటే ఏమిటో ఈపాటికే మనం చదివి వున్నాం.కాగా తాజాగా ఇది చాలా కీలకమైన పరీక్షల్లో నెగ్గుకు వస్తూ సత్తా చాటుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా 20 నిమిషాల్లో ఏకంగా 2 వేల పదాల వ్యాసాన్ని రాసి మరొక విశ్వ విద్యాలయ పరీక్ష పాస్ అయిందట ChatGpt.
అవును, ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, పీటర్ 2000 పదాల వ్యాసాన్ని వ్రాయమని ChatGptని ఆదేశించగా అతనికి దిమ్మ తిరిగే రీతిలో AI ChatGpt దానిని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేసి సంచనం సృష్టించింది.కాగా దానిని ఉపాధ్యాయులకు చూపించి వాల్యుయేషన్ చేయాలని కోరగా ఉపాధ్యాయులు ఆ వ్యాసానికి 53, 2:2 స్కోరు ఇవ్వడం విశేషం.వ్యాసంలోని పదాల అమరిక కొంచెం సంక్షిష్టంగా ఉందని, అయితే ఇది ఏమంత ఇబ్బందికరంగా లేదని కూడా ఉపాధ్యాయులు ఇక్కడ తమ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ఇకపోతే, గత ఏడాది గ్రాడ్యుయేట్ అయిన పీటర్… స్నెప్‌వాంజర్స్, ప్రోగ్రామ్‌తో ప్లగరిజం సాధ్యమేనా? అని పరీక్షించడానికి ఒక వ్యాసాన్ని రూపొందించడానికి ChatGPT AI ని టెస్ట్ చేయడం జరిగిందని తెలుస్తోంది.కాగా ChatGpt టూల్ ఇలాంటి కీలకమైన టెస్ట్‌లో విజయవంతం కావడం ఇదే తొలిసారి కాదు.ఇటీవల US మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష, వార్టన్ బిజినెస్ MBA ప్రోగ్రామ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు చివరి పరీక్ష, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా లా స్కూల్ నాలుగు స్కూల్ పరీక్షలతో సహా కొన్ని ప్రముఖ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం విశేషం.