చిరంజీవి సినిమాలు అంటే ఇష్టపడనివారు ఎవ్వరు ఉండరు.చిరంజీవి కూడా అనుక్షణం ఫాన్స్ కానీ జనం కానీ తన నుంచి ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకొని వాళ్ళకి నచ్చిన సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తుంటారు.
అలా చేయడం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు.అయితే చిరంజీవి గుణశేఖర్ డైరెక్షన్ లో చేసిన మృగ రాజు సినిమాలో సింహం నాగబాబు ని చంపే సీన్ ఒకటి ఉంది దాంట్లో నిజమైన సింహం వచ్చి నాగబాబు ని చంపేస్తుంది

ఆ సీన్ చేసేటప్పుడు ఆ సింహం నాగబాబు ని ఏమైనా చేస్తుందేమో అనే భయం ఒక పక్క నాగబాబు చనిపోయిన క్యారెక్టర్ లో అలా పడి పోయి ఉంటె అతన్ని అలా చూడలేక ఎంతైనా రియల్ లైఫ్ లో సొంత తమ్ముడు కాబట్టి తనని చనిపోయిన వ్యక్తిగా చూడాలి అన్న చిరంజీవి కి చాలా భయంగా, భాద గా అనిపించిందట అయినా కూడా ఒక యాక్టర్ అంటే అన్ని చేయాలి ఇది అయినా యాక్టింగ్ కదా తమ్ముడికి ఏం కాదు అం అనుకొని గుండె ని రాయి చేసుకొని ఆ సీన్ చేశారట.అక్కడ ఉండి ఇదంతా చూసిన వాళ్ళు నిజంగా చిరంజీవి కి తమ్ముళ్లు అంటే ఎంత ఇష్టమో తెలుసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలు.

అయితే ఈ సినిమా 2001 లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.అయినప్పటికీ ఈ సినిమా చిరంజీవి చేసిన ఒక రకమైన ప్రయోగం అనే చెప్పాలి.ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇప్పటికే చిరంజీవి ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయం అందుకున్నాడు భోళా శంకర్ సినిమాతో ఆ హిట్స్ పరం పర కొనసాగించాలని చూస్తున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు.భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యాక చిరంజీవి తన నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుసుంది…
.







