అదానీ గ్రూప్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ రెండు పిటిషన్లు దాఖలైయ్యాయి.
ఈ నేపథ్యంలో పిటిషన్లను విచారణకు స్వీకరించిన ధర్మాసనం రేపు విచారణ నిర్వహించనుంది.
హిండెన్ బర్గ్ నివేదిక ఇన్వెస్టర్లను నష్టానికి గురి చేసిందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.
దేశ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా నివేదిక ప్రభావం పడిందని పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే అదానీ గ్రూప్ తన షేర్ల ధరలు, ఖాతాల్లో మోసాలకు పాల్పడుతుందని హిండెన్ బర్గ్ సంస్థ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.