మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.ఈ సమ్మర్ లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సమయంలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమా ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
దొంగతనాల కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా యూనిట్ సభ్యులు వెళ్లడించారు.ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యింది.సినిమాలో ఆమె పాత్ర కొద్ది సమయం మాత్రమే ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా వంద నిమిషాల నిడివి ఆమె స్క్రీన్ టైమ్.
రవితేజ తో కాంబో సన్నివేశాలు సినిమా లో చాలా స్పెషల్ గా ఉంటాయట.

అంతే కాకుండా రవితేజ మరియు రేణు దేశాయ్ ల మధ్య ఉండే కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి అని కూడా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.సినిమా లో ఎక్కువ నిడివి పాత్రను రేణు దేశాయ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.నటిగా చాలా సంవత్సరాలుగా రేణు దేశాయ్ ని ప్రేక్షకులు వెండి తెరపై చూడాలని ఆశ పడుతున్నారు.

అప్పట్లో జానీ సినిమా చేసి మళ్లీ కనిపించలేదు.అయితే సోషల్ మీడియా ద్వారా మరియు బుల్లి తెరపై కూడా తెగ సందడి చేస్తోంది.హీరోయిన్ గా గతంలో చేసిన రేణు దేశాయ్ కి టైగర్ నాగేశ్వరరావు సెకండ్ ఇన్నింగ్స్ అవ్వబోతుంది.ఈ సినిమా హిట్ అయ్యి.పాత్ర విషయంలో మంచి పేరు వస్తే కచ్చితంగా ముందు ముందు మరిన్ని సినిమా ల్లో కూడా రేణు దేశాయ్ నటించే అవకాశాలు ఉన్నాయి.







