తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తెలుగు లో చేసిన సినిమా వారసుడు.తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.
కానీ తమిళనాడు లో భారీ గా కలెక్షన్స్ నమోదు చేసింది.

దాదాపుగా 200 కోట్ల రూపాయలను అక్కడి నుండి రాబట్టినట్లుగా తెలుస్తోంది.తెలుగు సినిమా గా ప్రచారం చేసినా కూడా వారసుడు కనీసం 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయలేక పోయింది.ఇప్పుడు ధనుష్ నటించిన సార్ సినిమా పరిస్థితి కూడా అదే అన్నట్లుగా ఉంది.
తెలుగు సినిమా అవ్వడం తో పాటు తెలుగు దర్శకుడు తెరకెక్కించిన తెలుగు నిర్మాత నిర్మించిన సార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కంటే తమిళనాడు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.అక్కడ ఈజీగా రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వారసుడు మాదిరిగానే కనీసం 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ నమోదు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో ఎక్కువగా అక్కడే శ్రద్ధ పెడుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ కోసం ధనుష్ హాజరయ్యాడు, కానీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది మాత్రం క్లారిటీ లేదు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సార్ సినిమా లో ధనుష్ విభిన్నమైన పాత్ర లో కనిపించబోతున్నాడు.

విద్యా వ్యవస్థ పై ఈ సినిమా రూపొందినట్లుగా తెలుస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించాడు.ధనుష్ కి ఈ సినిమా తెలుగు లో మంచి మార్కెట్ క్రియేట్ చేస్తుందని అంత నమ్ముతున్నారు.
మరి సార్ ఫలితం ఏంటి అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.







