ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది.ఇందులో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ కోర్టు ముందు హజరుపరచనున్నారు అధికారులు.ముందుగా వైద్య పరీక్షల కోసం తరలించనున్నారు.
అనంతరం మద్యం కుంభకోణం కేసులో బుచ్చిబాబు పాత్రను అధికారులు కోర్టుకు వివరించనున్నారు.అదేవిధంగా కస్టడీకి కోరనున్నారని తెలుస్తోంది.







