సాధారణంగా ఏవైనా కొత్త సినిమాలు విడుదల అయ్యాయి అంటే ఆ సినిమాలో హీరో హీరోయిన్ల పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్లు అలాగే డాన్సులు చేసేటప్పుడు కొంచెం ఎవరైనా ఎక్కువగా డాన్స్ చేస్తే వెంటనే వారి గురించి సోషల్ మీడియాలో సర్చ్ చేస్తూ ఉంటారు.తాజాగా సోషల్ మీడియాలో ఒక బ్యూటీ కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి.
ఆమె మరెవరో దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాలో ఒక సాంగ్లో విజయ్ పక్కన డాన్స్ చేసిన బ్యూటీనే.కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి తాజాగా నటించిన చిత్రం వారసుడు.
ఈ సినిమా విడుదల అయ్యి అందుకోవడంతో పాటు కొట్లలో కలెక్షన్స్ ను రాబట్టిన విషయం తెలిసిందే.
గత నెల సంక్రాంతి పండగకు విడుదలైన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.
ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ తగ్గుముఖం పడుతుండడంతో ఈ సినిమా నుంచి ఒక్కొక్క వీడియో సాంగ్ విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుండి రంజితమే సాంగ్ విడుదల అయ్యింది.ఈ మాస్ బీట్ సాంగ్ లో విజయ్, రష్మికలతో పాటు చాలామంది సైడ్ డాన్సర్స్ హైలైట్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో సాంగ్ చివరలో హీరో విజయ్ పక్కనే అనగా కుడివైపు రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి చాలా ఎనర్జిటిక్ గా షెహనాయ్ ఊది స్టెప్పు లను ఇరగదీసింది.దీంతో ఇప్పుడు నెటిజన్స్ దృష్టంతా కూడా ఆ అమ్మాయి పైనే పడింది.ఇక వెంటనే నెటిజన్స్ ఆమె గురించి సోషల్ మీడియాలో ఆరా తీయగా ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.ఆమె పేరు అంబికా కోహ్లీ. ఈమె ఇంస్టాగ్రామ్ లో పటాకా అనే పేరు పెట్టుకుంది.

ఇక ఇంస్టాగ్రామ్ లో ఆమెకు లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.అంబికా తన ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో పాటుగా ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది.ఒకవైపు డాన్సర్ గా రాణిస్తూనే ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అంబికా.
ప్రస్తుతం రంజితమే సాంగ్ లో విజయ్, రష్మికల పక్కన అంబికా చేసిన స్టెప్స్ హైలైట్ గా మారాయి.







