మళ్లీ సినిమాలు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పేసిన జయమ్మ

బుల్లి తెర లేడీ సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న యాంకర్ సుమ ఏ కార్యక్రమం చేసిన కూడా సూపర్ హిట్ అనడంలో సందేహం లేదు.హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈమె రెమ్యూనరేషన్ ఉంటుంది.

 Anchor Suma Dont Want To Do Films Details, Anchor Suma, Jayamma Panchayithi, Sum-TeluguStop.com

నెల లో 20 రోజులు ఏదో ఒక షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న సుమ ఆ మధ్య సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.జయమ్మ పంచాయితీ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమ నిరాశ పరిచింది.

అలాంటి సినిమా సుమ ఎలా చేసిందంటూ విమర్శలు వచ్చాయి.సుమ సినిమాల ఎంపిక విషయం లో జాగ్రత్త తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అనేది చాలా మంది అభిప్రాయం.

కానీ ఇప్పటి వరకు సుమ తదుపరి చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ మధ్య ప్రముఖ నిర్మాత ఒకరు సుమ ని తమ బ్యానర్ లో నటించేందుకు అడిగారట, కానీ సుమ మాత్రం నో చెప్పిందని తెలుస్తోంది.

Telugu Anchor Suma, Suma, Suma Adda, Tollywood-Movie

మళ్లీ సినిమా ల్లో నటించే అవకాశం లేదని ఆమె తేల్చి చెప్పిందట.అంతే కాకుండా ప్రస్తుతానికి పూర్తిగా బుల్లి తెర పైనే తాను కనిపిస్తానని పేర్కొంది.ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపు ఉంది.సినిమా లో చేసి దాన్ని పాడు చేసుకోక పోవడమే మంచిది అని భావిస్తుందట.సుమ అభిమానులు మాత్రం వెండి తెర పై కూడా ఆమె ను చూడాలని కోరుకుంటున్నారు.

Telugu Anchor Suma, Suma, Suma Adda, Tollywood-Movie

జయమ్మ పంచాయతీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఖచ్చితం గా ఇప్పటి వరకు సుమ రెండు, మూడు సినిమా లకు కమిట్ అయ్యేది.అందులో ఒకటి రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వచ్చేవి.ప్రస్తుతానికి మాత్రం సుమ దాదాపు అన్ని పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తూ మరో వైపు ఈటీవీలో ప్రసారం అవుతున్న సుమ అడ్డ షో కు హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube