తెలంగాణలో రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ ఇప్పటి నుంచే తనదైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.ఇందులో భాగంగా మిషన్ 90 లక్ష్యంగా బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
పదిహేను రోజుల్లో పదకొండు వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది.ఈ మేరకు గ్రామాల్లో ఈనెల 10 వ తేదీ నుంచి 25 వరకు కార్నర్ మీటింగ్స్ ను నిర్వహించనుంది.
ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి పార్టీ ఎనిమిది వందల మంది లీడర్లను నియమించింది.ఈ క్రమంలోనే ఇవాళ మన్నెగూడలో బీజేపీ నేతలను శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.
కార్నర్ మీటింగ్స్ లో ఏ అంశాలు చర్చించాలనే దానిపై నేతలను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు.