అన్ స్టాపబుల్1 స్థాయిలో సీజన్2 సక్సెస్ కాకపోవడానికి అసలు కారణాలివే!

చాలా సంవత్సరాల క్రితమే ఓటీటీల హవా మొదలైనా కరోనా సమయంలో ఓటీటీలకు ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరిగింది.థియేటర్లలో సినిమాలను చూడటానికి సమయం కేటాయించలేని వాళ్లు సాంగ్స్, ఫైట్స్ లేకుండా సినిమాలను చూడటానికి ఇష్టపడేవాళ్లు ఓటీటీలలో సినిమాలను చూడటానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

 Reasone Behind Unstoppable Season2 Failure Details Here Goes Viral In Social Med-TeluguStop.com

అయితే ఆహా ఓటీటీ సినిమాలతో పాటు టాక్ షోలను, ఇతర షోలను ప్రసారం చేస్తోంది.

అయితే అన్ స్టాపబుల్ సీజన్1 సక్సెస్ అయినా సీజన్2 మాత్రం ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

ప్రభాస్, పవన్ ఎపిసోడ్లు లేకపోతే సీజన్2 అస్సలు ఆకట్టుకునేది కాదు.పవన్, ప్రభాస్ ఎపిసోడ్లను సైతం రెండు పార్టులుగా రిలీజ్ చేయడం గురించి అభిమానుల్లో ఒకింత అసంతృప్తి ఉంది.

మరోవైపు ఈ షో స్క్రిప్టెడ్ అని ప్రశ్నలు, జవాబులు ముందే సిద్ధం చేసినవని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Aha Ott, Balakrishna, Chiarnjeevi, Pawan Kalyan, Prabhas, Tollywood-Movie

కొన్ని వారాల పాటు ఈ షో మధ్యలో ప్రసారం కాకపోవడం కూడా అన్ స్టాపబుల్ షో అభిమానులకు చిరాకు తెప్పించింది.ప్రభాస్, పవన్ ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చినా మిగతా ఎపిసోడ్లలో ఆకట్టుకోని ఎపిసోడ్లు ఎక్కువగానే ఉన్నాయి.చిరంజీవి, ఎన్టీఆర్, చరణ్ లాంటి క్రేజీ హీరోలు ఈ షోకు హాజరై ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపించాయి.

ఈ హీరోల కోసం సీజన్3 వరకు ఆగలేమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Telugu Aha Ott, Balakrishna, Chiarnjeevi, Pawan Kalyan, Prabhas, Tollywood-Movie

అక్కినేని హీరోలకు బాలయ్యకు మధ్య సఖ్యత లేకపోవడంతో అక్కినేని స్టార్స్ మాత్రం ఈ షోకు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు.అన్ స్టాపబుల్3 మొదలుకావడానికి మరో ఆరు నెలల సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది.సీజన్3 ను కొత్తగా ప్లాన్ చేయాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.అన్ స్టాపబుల్ సీజన్3 కు బాలయ్యే హోస్ట్ గా కొనసాగాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube