SSMB29.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే అన్ని కోట్లు ఖర్చు చేస్తున్న జక్కన్న!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అగ్ర డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అనే విషయం తెలిసిందే.ఇటీవలే ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన జక్కన్న ఇప్పుడు మహేష్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.

 Mahesh Babu And Ss Rajamouli Film Update-TeluguStop.com

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కోసం కథను సిద్ధం చేసాడు.

భారీ అడ్వెంచర్ కథ మహేష్ కోసం రెడీ అవుతుంది అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు.

ప్రెజెంట్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తునాన్రు.ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంత వరకు రానటువంటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమా చేయబోతున్నాడు అని ఇప్పటికే టాక్ వచ్చింది.

రాజమౌళి, మహేష్ తో ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కించ బోతున్నట్టు వార్తలు వచ్చాయి.

Telugu Mahesh Babu, Maheshbabu, Ss Rajamouli, Ssmb, Ssmb Budget, Ssmb Pre, Trivi

తాజాగా మాత్రం మహేష్ బాబు సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఏకంగా 15 కోట్ల రూపాయల వరకు జక్కన్న ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కు రావడంతో జూన్ లేదా జులై లో ఈ సినిమా లాంచింగ్ ఉండనుందట.

లాంచింగ్ రోజే ఈ సినిమా క్యాస్టింగ్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు టాక్ వస్తుంది.ఈ సినిమాలో హాలీవుడ్ తారాగణం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Ss Rajamouli, Ssmb, Ssmb Budget, Ssmb Pre, Trivi

మహేష్ బాబు ప్రెజెంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 చేస్తున్నాడు.ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది.ఈ సక్సెస్ ఫుల్ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసుకుని ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇది పూర్తి అయిన తర్వాత మహేష్ రాజమౌళి సినిమాలో జాయిన్ కానున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube