''రైటర్ పద్మభూషణ్''పై మహేష్ ప్రశంసలు.. సినిమాకు మరింత బూస్ట్!

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండడం లేదు.ప్రేక్షకుల ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం వల్ల సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి అనేది విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

 Mahesh Babu Praises Writer Padmabhushan, Mahesh Babu, Writer Padmabhushan, Suha-TeluguStop.com

ఎందుకంటే ఇంతకు ముందులా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నాలుగు ఫైట్స్, ఐదు పాటలు జోడించి రిలీజ్ చేసేవారు.ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరో కోసం సినిమాలు చూసే వారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.ఇది వరకులా కాకుండా ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.కంటెంట్ లేకుండా కమర్షియల్ గా వస్తే స్టార్ హీరోల సినిమాలను కూడా డిజాస్టర్స్ చేస్తున్నారు.దీంతో చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ తో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంచి మంచి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ప్రశంసలు సైతం అందుకుంటున్నాయి.

Telugu Mahesh Babu, Maheshbabu, Suhas, Tollywood Box, Tollywoodmahesh-Movie

ఇక తాజాగా మన తెలుగులో ఇలాంటి మంచి సినిమా ఒకటి వచ్చింది.”రైటర్ పద్మభూషణ్”.ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

సుహాస్ నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో సఫలం అయ్యింది.ఇక తాజాగా ఈ సినిమా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కూడా అందుకుంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Suhas, Tollywood Box, Tollywoodmahesh-Movie

రైటర్ పద్మభూషణ్ సినిమాను మహేష్ బాబు తాజాగా వీక్షించారు.ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా పిక్ షేర్ చేస్తూ ఒక పోస్ట్ కూడా చేస్తూ చిత్ర యూనిట్ ను అభినందించారు.‘రైటర్ పద్మభూషణ్ ను చూసి ఆనందించాను.హృదయ పూర్వక చిత్రం, ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంది.

ఫ్యామీలీస్ తప్పకుండ చూడాల్సిన సినిమా ఇది.సుహాస్ నటన నచ్చింది.అంటూ ప్రశంసలు కురిపించడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు.మరి మహేష్ బాబు అభినందనలు ఈ సినిమాకు బూస్ట్ అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube