వాణీ జయరాం ఫోరెన్సిక్ నివేదిక వచ్చేసింది.. గాయాలకు అసలు కారణం ఇదే!

ప్రముఖ దివంగత గాయని వాణి జయరాం ఇటీవలే మరణించిన విషయం తెలిసింది.ఆమె మరణంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.

 Tamilnadu Police Gives Clearance On Vani Jayaram Death Details, Tamilnadu, Vani-TeluguStop.com

తాజాగా అధికారిక లాంచనాలతో ఆమె అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే.అయితే ఆమె చనిపోయినప్పుడు ఆమె నుదుటిపై గాయాలు కనిపించడంతో ఆమె మృతి పట్ల అనేక రకాల అనుమానాలు రేకెత్తిన విషయం మనందరికీ తెలిసిందే.

దాంతో ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగింది.తాజాగా ఆ రిపోర్ట్ బయటికి రావడంతో ఆమె తలపై గాయలు అవ్వడానికి గల కారణాలు కూడా బయటకు వినిపిస్తున్నాయి.అయితే వాణీ జయరాం తన బెడ్రూంలో కింద పడటంతో ఆమె తలకు బలమైన దెబ్బ తగిలిందని దాంతో ఆమె మృతి చెందింది అనే ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాకుండా వాణి జయరామ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను కూడా తాము క్షేమంగా పరిశీలించామని

Telugu Forensic, Vani Jayaram, Tamilnadu, Tollywood, Vanijayaram-Movie

ఎక్కడా కూడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని వారు స్పష్టం చేశారు.దాంతో వాణి జయరాం మృతి పై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.కాగా ఫిబ్రవరి 4వ తేదీన ఆమె మరణించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఆరోజే మరొక విశేషం కూడా ఉంది.1968 ఫిబ్రవరి 4వ తేదీన వాణి జయరాం వివాహం చేసుకుంది.సరిగ్గా అదే రోజున ఆమె మృతి చెందింది.వాణి భర్త జయరాం 2018లో కన్నుమూశారు.ఇది దంపతులకు పిల్లలు లేరు.కాగా వాణి జయరాం అప్పట్లో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా

Telugu Forensic, Vani Jayaram, Tamilnadu, Tollywood, Vanijayaram-Movie

తమిళం,హిందీ, మలయాళం,గుజరాతి,ఒరియా మొత్తం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా గాయనిగా మూడుసార్లు ఉత్తమ జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది.గొప్ప గాయని ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

తాజాగా తమిళనాడులో ఆమె అంతక్రియలు జరిగిన విషయం తెలిసిందే.ఆమె అంత్యక్రియలకు సెలబ్రిటీలు అభిమానులు తరలి రావడంతో పోలీసులు భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube