తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ స్టార్ హీరోలైనా చిరంజీవి బాలకృష్ణ వంటి వారికి గట్టి పోటీగా నిలిచిన రాజశేఖర్ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
ఇలా అడపాదడపా సినిమాలలో నటిస్తున్నటువంటి రాజశేఖర్ తన కుమార్తెలు శివాని శివాత్మికను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్లుగా పరిచయం చేశారు.అయితే వీరిద్దరూ హీరోయిన్లుగా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు.

ఇకపోతే రాజశేఖర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా వృత్తిపరంగా వైద్యుడు అనే విషయం మనకు తెలిసిందే.ఇలా వైద్యుడిగా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజశేఖర్ కు నటి శ్రీ లీలకు మధ్య చిన్న రిలేషన్ ఉంది.శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.మరి యంగ్ హీరోయిన్ శ్రీలీలకు సీనియర్ నటుడు రాజశేఖర్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…

హీరోయిన్ శ్రీ లీల నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ వృత్తిపరంగా ఈమె కూడా వైద్య విద్యను అభ్యసిస్తుంది.ఈ ఏడాదిలో ఈమె డాక్టర్ పట్టా కూడా అందుకోబోతున్నారు.ఇలా ఈమె కూడా వైద్య విద్యను అభ్యసించి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగారు.ఇలా రాజశేఖర్ మాదిరిగానే ఈమె కూడా డాక్టర్ చదువు చదివి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగడమే వీరి మధ్య ఉన్న రిలేషన్ అయితే శ్రీ లీల మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు కూడా వైద్య వృత్తిని అభ్యసించి సెలెబ్రిటీలుగా కొనసాగుతున్నారు.
ఇక ప్రస్తుతం శ్రీ లీల వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.







