కమెడియన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన సుహాస్ తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.ముఖ్యంగా కలర్ ఫోటో సినిమా తో ప్రేక్షకుల ముందుకు 2020 సంవత్సరం లో వచ్చిన సుహాస్ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకోవడంతో పాటు కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్నాడు.
ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా సినిమా లో కూడా నటించి ఆకట్టుకున్నాడు.గత ఏడాది అడవి శేషు హీరోగా నటించిన హిట్ 2 సినిమా లో విలన్ పాత్రలో కనిపించి ఆశ్చర్య పరిచాడు.
నటుడిగా అన్ని రకాల విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న సుహాస్ ఎంతో మంది యంగ్ స్టార్ హీరోలకు ఆదర్శం అనేలా ప్రవర్తిస్తున్నాడు.ప్రస్తుతం సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా లో కూడా ఈ సినిమా కు మంచి స్పందన లభిస్తుంది.కలర్ ఫోటో సినిమా థియేటర్ రిలీజ్ మిస్సయింది, కానీ ఈ సినిమాను థియేటర్ ద్వారా తీసుకు రావడం తో ప్రేక్షకులు సుహాస్ సినిమాకు ఫీదా అవుతున్నారు.

చాలా న్యాచురల్ గా సినిమా ఉండడంతో పాటు కథ ను ఎంపిక చేసుకున్న విషయం లో అందరూ అభినందిస్తున్నారు.మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా గా రూపొందిన రైటర్ పద్మభూషణ్ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది.ముందు ముందు కూడా ఇదే తరహా కథలను ఎంపిక చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తూ వెళ్తే కచ్చితంగా హీరోగా స్టార్ డం దక్కి ఆ స్థాయి అవకాశాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అంతే కాకుండా టాలీవుడ్ లో కమెడియన్ గా చేసి హీరోగా ఎదిగిన సునీల్ స్థాయిలో సుహాస్ నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కమెడియన్ గా నటిస్తే కెరియర్ జిల్ జిల్ జిగా అన్నట్లుగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.







