యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయన బరువు గురించి మాట్లాడుకుంటున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా తో పోలిస్తే ఎన్టీఆర్ ఈ మధ్య కాలం లో చాలా బరువు పెరిగాడు.
ఇటీవల తారకరత్న ను పరామర్శించేందుకు బెంగళూరు వెళ్లిన ఎన్టీఆర్ ని చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతుంది.నేడు కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు.
ఆ సందర్భం గా ఆయన లుక్ గురించి మళ్ళీ చర్చ జరిగే అవకాశం ఉంది.అందుకే అభిమానులు బరువు పెరుగుతున్నావు కాస్త చూసుకో అన్నా అంటూ సోషల్ మీడియా ద్వారా సలహా ఇస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ కోసమే ఎన్టీఆర్ ఇలా బరువు పెంచుతున్నాడు అనేది కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్.అసలు విషయం ఏంటి అనేది తెలియదు, కానీ ఎన్టీఆర్ బరువు తగ్గాలి అంటూ కొందరు సూచిస్తున్నారు.

గతం లో రాఖి, అశోక్ వంటి సినిమాల్లో భారీ కాయుడిగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా సన్నబడ్డాడు.కంత్రి, యమ దొంగ సినిమాల్లో చాలా సన్నగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత నార్మల్ వెయిట్ తో ఆకట్టుకున్నాడు.అమ్మాయిల హృదయాల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కాస్త బరువు తగ్గి కనిపిస్తేనే బాగుంటుంది అంటూ

అభిమానులు ముఖ్యంగా లేడీ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక అభిమానుల కోసమైనా ఎన్టీఆర్ కాస్త బరువు తగ్గుతాడేమో చూడాలి.ఎన్టీఆర్ వరుసగా కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.అంతే కాకుండా పలు సినిమాలను కూడా లైన్ లో పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.







