బాలుడి ప్రతిభకి ఫిదా అవుతున్న నెటిజన్స్... చూస్తే మీరే ఆశ్చర్యపోతారు!

గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగే వారికి ఏం తెలివితేటలు వుంటాయిలే అని చాలామంది అనుకుంటూ వుంటారు.అయితే అలాంటి మాటలను ఇపుడు పటాపంచలు చేస్తున్నాడు ఓ బాలుడు.

 Boy Converted A Cycle Into A Car Details, Kids Talent, Viral Latest, News Viral,-TeluguStop.com

అవును, కారులో ప్రయాణించాలనేది ఆ బాలుడి కోరిక.అంతేకాకుండా ఆ కారును తానే నడపాలనే ఆశ అతనికి బాగా వుంది.

అయితే ఆశ మంచిదేకానీ… కారు కొనుక్కునే పరిస్థితి ఏమిటి? అని అనుకుంటున్నారా? అవును, ఆ బాలుడి ఇంట్లో అలాంటి పరిస్థితి లేదు.ఇక కారును నడిపే వయసు కూడా ఆ కుర్రాడిది కాదు.

Telugu Bicycle, Cycle Car, Fourth Class, Samudram, Naveen, Netizens, Latest-Late

అయితేనేం, అందుబాటులో ఉన్న కాసిన్ని వనరులతోనే ఆ బాలుడు ఓ కారును తోలుతున్న భావనతో సైకిల్ తొక్కుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.సైకిలేమిటి, కారేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాబు.ఆ బాలుడు K సముధ్రంలోని ప్రాధమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు.ఆ బాలుడి పేరు నవీన్.అతగాడికి కారు నడపాలని కోరిక అయితే వుంది కానీ అతడి కుటుంబానికి కారు కొనే ఆర్థిక స్థోమత లేదాయె.పైగా అతడికి కారు నడిపే వయసు లేదు, కానీ కారు నడపాలనే తన కోరికను తీర్చుకోవడానికి నవీన్ వినూత్నంగా ఆలోచించాడు.

Telugu Bicycle, Cycle Car, Fourth Class, Samudram, Naveen, Netizens, Latest-Late

ఆలోచించిందే తడవుగా… ఆచరణలో పెట్టేసాడు.ఉపాయం ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు కదా.మనోడి తెలివికి జోహార్లు కొట్టక మానరు ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.అవును, తను రోజు నడిపే సైకిల్ కు హ్యాండిల్ తీసేసి దాని స్థానంలో కారు స్టీరింగ్ అమర్చి ఎంచక్కా ‘సైకిల్ కారు’ తొక్కుకుంటూ వీధుల్లో ఇపుడు షికారు చేస్తున్నాడు.

సైకిల్ తొక్కుతూ కార్లతో పోటీ పడుతూ మరీ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పిల్లాడు.ఈ క్రమంలోనే ఇప్పుడు నవీన్ సైకిల్ తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దాంతో నవీన్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube