బాలుడి ప్రతిభకి ఫిదా అవుతున్న నెటిజన్స్… చూస్తే మీరే ఆశ్చర్యపోతారు!

గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగే వారికి ఏం తెలివితేటలు వుంటాయిలే అని చాలామంది అనుకుంటూ వుంటారు.

అయితే అలాంటి మాటలను ఇపుడు పటాపంచలు చేస్తున్నాడు ఓ బాలుడు.అవును, కారులో ప్రయాణించాలనేది ఆ బాలుడి కోరిక.

అంతేకాకుండా ఆ కారును తానే నడపాలనే ఆశ అతనికి బాగా వుంది.అయితే ఆశ మంచిదేకానీ.

కారు కొనుక్కునే పరిస్థితి ఏమిటి? అని అనుకుంటున్నారా? అవును, ఆ బాలుడి ఇంట్లో అలాంటి పరిస్థితి లేదు.

ఇక కారును నడిపే వయసు కూడా ఆ కుర్రాడిది కాదు. """/" / అయితేనేం, అందుబాటులో ఉన్న కాసిన్ని వనరులతోనే ఆ బాలుడు ఓ కారును తోలుతున్న భావనతో సైకిల్ తొక్కుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

సైకిలేమిటి, కారేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాబు.ఆ బాలుడు K సముధ్రంలోని ప్రాధమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు.

ఆ బాలుడి పేరు నవీన్.అతగాడికి కారు నడపాలని కోరిక అయితే వుంది కానీ అతడి కుటుంబానికి కారు కొనే ఆర్థిక స్థోమత లేదాయె.

పైగా అతడికి కారు నడిపే వయసు లేదు, కానీ కారు నడపాలనే తన కోరికను తీర్చుకోవడానికి నవీన్ వినూత్నంగా ఆలోచించాడు.

"""/" / ఆలోచించిందే తడవుగా.ఆచరణలో పెట్టేసాడు.

ఉపాయం ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు కదా.మనోడి తెలివికి జోహార్లు కొట్టక మానరు ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.

అవును, తను రోజు నడిపే సైకిల్ కు హ్యాండిల్ తీసేసి దాని స్థానంలో కారు స్టీరింగ్ అమర్చి ఎంచక్కా 'సైకిల్ కారు' తొక్కుకుంటూ వీధుల్లో ఇపుడు షికారు చేస్తున్నాడు.

సైకిల్ తొక్కుతూ కార్లతో పోటీ పడుతూ మరీ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పిల్లాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు నవీన్ సైకిల్ తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దాంతో నవీన్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కూతురిని ఎప్పుడు చూపిస్తావ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా?