తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాధ్ గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 50 సినిమాలకు ఈయన దర్శకత్వం వహించారు.30 సినిమాలలో నటుడిగా నటించారు.ఇలా నటుడిగా దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన గురువారం రాత్రి 11 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు తనని అపోలో ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.ఇలా విశ్వనాధ్ గారి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.గురువారం రాత్రి విశ్వనాథ్ గారు మరణించడంతో శుక్రవారం సాయంత్రం ఈయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయం ప్రకారం జరిగాయి.

ఈ విధంగా విశ్వనాధ్ గారు మరణించడంతో ఆయన మరణానికి గల కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు.అయితే విశ్వనాధ్ గారు 92 సంవత్సరాల వయసు కావడంతో ఈయన వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు.అయితే గత కొంతకాలంగా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న విశ్వనాధ్ గత కొంతకాలంగా తరచు ఆసుపత్రికి వెళ్తూ చికిత్స చేయించుకుంటున్నారు.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు ఈయనని కలిసి తన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
అయితే వయసు పై బడటం వల్లనే విశ్వనాథ్ గారు మరణించారని వయో వృద్ధాప్య సమస్యలే ఈయన మరణానికి కారణమని తెలుస్తుంది.







