బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణ మంత్రులకు సవాల్ విసిరారు.దమ్ముంటే నేను చెప్పిన లెక్కల మీద మంత్రులు చర్చికి రావాలని కేటీఆర్ ,హరీష్ రావు లను ఉద్దేశించి రాజేందర్ సవాల్ విసిరారు.
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ఓట్ల కోసం ఉంటాయని రాజేందర్ అన్నారు .కానీ 9 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ అటువంటి బడ్జెట్ పెట్టలేదని రాజేందర్ తెలిపారు.
చాలామంది ఆశించినట్లుగా మభ్యపెట్టి మోసం చేసే విధంగా నూ, ఓట్లను దండుకునే విధంగానూ ఈ బడ్జెట్ లేదని రాజేందర్ చెప్పుకొచ్చారు.ప్రాక్టికల్ బడ్జెట్ ను మాత్రమే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారని , ద్రవ్యలోటును తగ్గించాలనే లక్ష్యం కేంద్ర బడ్జెట్లో కనిపిస్తోందని రాజేందర్ తెలిపారు మౌలిక వసతుల కల్పన కోసం పది లక్షల కోట్లు బడ్జెట్ లో పెట్టడం మామూలు విషయం కాదని రాజేందర్ అన్నారు.

కేంద్ర బడ్జెట్ పై కేటీఆర్ , హరీష్ రావులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, మోది 10 లక్షల కోట్లు అప్పు చేశారని వారు విమర్శిస్తున్నారని, దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.తాను విదేశాల్లో చదువుకోలేకపోవచ్చు, ఇంగ్లీషులో మాట్లాడలేకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్లు ఇప్పుడు చెబితే ప్రజలు నమ్ముతారని వారు పగటి కలలు కంటున్నారని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి విమర్శించారు.

రాష్ట్రం ఏర్పడే నాటికి జిఎస్ డిపి లో అప్పు 15% ఉంటే , 2020 – 21 వరకు దాదాపు 30 శాతానికి చేరిందని రాజేందర్ అన్నారు.2014లో జిడిపిలో 50.1% అప్పు ఉంటే 2020 21 లో 48% మాత్రమే అప్పు ఉందని అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది అని రాజేందర్ విమర్శించారు.
తెలంగాణలో ఒక వ్యక్తి సగటు అప్పు లక్ష 25 వేల రూపాయలను రాజేందర్ విమర్శించారు.







