మళ్లీ మొదలెట్టబోతున్న షర్మిల ! నేడు గవర్నర్ కు ఫిర్యాదు

సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో , ప్రధాన పార్టీలన్నిటితోను  పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు , ప్రజాబలం పొందేందుకు ఆమె పాదయాత్రను నమ్ముకున్నారు ఇప్పటికే తెలంగాణలో పాదయాత్రను మొదలుపెట్టారు.చాలాకాలంగా ఆ యాత్రను వాయిదా వేసుకున్నారు.ఇప్పుడు మళ్లీ ఈ రోజు నుంచి ఆయాత్రను ప్రారంభించేందుకు ఆమె సిద్ధమయ్యారు.అంతకంటే ముందుగా ఈరోజు మధ్యాహ్నం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ తో ప్రత్యేకంగా షర్మిల భేటీ కాబోతున్నారు.ఈ సందర్భంగా కెసిఆర్ పాలనలో చోటు చేసుకుంటున్న పరిణామాలు , ప్రభుత్వ వైపల్యాలపై గవర్నర్ కు షర్మిల ఫిర్యాదు చేయనున్నారు.

 Today Afternoon Sharmila Special Meeting With Governor Tamilisai Soundararajan-TeluguStop.com
Telugu Telangana, Ys Sharmila, Ysrcp-Politics

గవర్నర్ తో సమావేశం ముగిసిన తర్వాత నర్సంపేట నియోజకవర్గానికి షర్మిల చేరుకుంటారు.అక్కడ చెన్నారావుపేట మండలం శంకరమ్మ తండా నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు.కొద్ది వారాలు క్రితం షర్మిల పాదయాత్ర ఇదే ప్రాంతంలో నిలుపుదల చేశారు .బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడం,  షర్మిల కేర్వాన్ కు బిఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించడం తదితర సంఘటనలు చోటు చేసుకోవడంతో,  ఆమె అప్పట్లో యాత్రను నిలిపివేశారు.ఇప్పుడు పాదయాత్ర ఎక్కడి నుంచి  ఆగిందో అక్కడి నుంచే యాత్రను ప్రారంభించనున్నారు.ఈరోజు సాయంత్రం 5.30  నిమిషాలకు నెక్కొండలో మాట ముచ్చట కార్యక్రమాన్ని షర్మిల నిర్వహిస్తారు.తెలంగాణ అంతట పాదయాత్ర నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారానికి దిగేందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Telugu Telangana, Ys Sharmila, Ysrcp-Politics

అలాగే పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను గుర్తించి వారితో షర్మిల పార్టీ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.ఇప్పటికే షర్మిల పార్టీలో చేరికలు లేకపోవడం తో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి.పాదయాత్ర అనంతరం షర్మిల వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube