వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హీట్ పెరుగుతోంది.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోన్ ట్యాప్ తో దొంగచాటున తన సంభాషణను వింటున్నారని ఆరోపించారు.
కేంద్రం ముందు రాష్ట్రం బద్నాం అవుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు.
అయినా సరే ఆధారాలు ఇవ్వాలని సవాల్ చేస్తారా అని ప్రశ్నించారు.ఒక అధికారి తన ఫోన్ ట్యాప్ జరుగుతున్నట్లు చెప్పారన్నారు.
ట్యాపింగ్ కాదనుకుంటే నిరూపించాలని చెప్పారు.అన్ని వ్యవస్థలు మీ దగ్గరే ఉన్నాయన్న ఆయన ట్యాపింగ్ కాదని నిరూపించాలని సవాల్ విసిరారు.
ఈ క్రమంలో ఫోన్ ట్యాప్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.బెదిరింపులకు భయపడేది లేదన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీ నుంచి తప్పుకోబోతున్నట్లు వ్యాఖ్యనించారు.







