ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది.ఇందులో భాగంగా హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆయా హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమాలను మరొకసారి థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువ అయ్యింది.కాగా ఇప్పటికే జల్సా, ఖుషి, ఒక్కడు, మురారి, ఆది, త్రీ లాంటి సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే రీ రిలీజ్ లో విడుదల అయ్యే సినిమాలు ఇప్పటికే టీవీలలో సెల్లులో చాలా సార్లు చూసిన సినిమాలే.అయినప్పటికీ రీ రిలీజ్ అయ్యి భారీగానే కలెక్షన్స్ రాబట్టాయి.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోని మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అదే గ్యాంగ్ లీడర్.ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విషయం తెలిసిందే.అయితే మెగాస్టార్ నటించిన సినిమాలలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పవచ్చు.ఇప్పటికీ ఈ సినిమా విడుదల అయితే టీవీలకు అతుక్కుపోయేవారు ఉన్నారు అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.
ఇప్పటికే టీవీలో చాలా సార్లు చూసిన ఈ సినిమాను మరొకసారి రీ రిలీజ్ చేయనున్నారు.
ఈ రీ రిలీజ్ లో భాగంగా విడుదల చేసిన సినిమాలను రీ మాస్టర్ చేసి 4కే లో విడుదల చేస్తున్నారు.ఆ కోవలో ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే.అయితే గ్యాంగ్ లీడర్ సినిమాలో ఫిబ్రవరిలో ల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.
వేగా ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.అయితే సంక్రాంతి సినిమాల తర్వాత మంచి డేట్ చూసుకుని ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు గతంలో ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
అప్పట్లో మ్యూజికల్‌గా ఈ సినిమా పెద్ద ట్రెండ్ సెట్టర్.ఇకపోతే ఈ వార్త సోషల్ మీడియాలో అవడంతో చిరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.గ్యాంగ్ లీడర్ సినిమాను థియేటర్లలో చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కామెంట్ ల రూపంలో తెలియజేస్తున్నారు.