క్రిష్ డైరెక్షన్ లో శర్వానంద్ హీరో గా కమలినీ ముఖర్జీ హీరోయిన్ గా వచ్చిన సినిమా గమ్యం ఈ సినిమా 2008 లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది.ఈ సినిమా లో అల్లరి నరేష్ కూడా ఒక ముఖ్య పాత్ర లో నటించి మెప్పించాడు.
సినిమా చివరిలో అల్లరి నరేష్ తన యాక్టింగ్ తో అందరి చేత కన్నీళ్లు పెట్టేస్తాడు.అయితే ఇది ఇలా ఉంటే క్రిష్ ఈ సినిమా స్టోరీని ముందుగా హీరో నవదీప్ కి చెప్పాడు అయినప్పటికీ నవదీప్ అప్పుడు కమిట్ అయిన సినిమాలు చాలా ఉండడంతో డేట్స్ ఖాళీ లేక ఈ సినిమాని వదులుకున్నాడు.

దాంతో క్రిష్ శర్వానంద్ ని హీరోగా పెట్టీ మంచి హిట్ కొట్టాడు ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, మంచు మనోజ్ అనుష్క లను పెట్టీ వేదం సినిమా తీసి డైరెక్టర్ గా మరోసారి సక్సెస్ అయ్యాడు.ప్రస్తుతం క్రిష్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు అలాగే శర్వానంద్ కూడా ఈ మధ్యే ఒకే ఒక జీవితం సినిమా సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు అలాగే రీసెంట్ గా తను ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు…ఇక వీళ్ళ కెరియర్ ఇలా ఉంటే ఈ సినిమాని వదులుకున్న నవదీప్ హీరోగా చేసిన చాలా సినిమాలు ప్లాప్ అవ్వడం తో హీరోగా నవదీప్ కి కెరియర్ లేకుండా పోయింది…దాంతో హీరోగా ఆయన కి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు నేనే రాజు నేనే మంత్రి, ధృవ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి పేరు సాధించుకున్నారు.2007 లో కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన చందమామ సినిమా తో మంచి హిట్ అందుకున్న నవదీప్ 2008 లో గమ్యం సినిమా చేసి ఉంటే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ పడేవి దాంతో ఆయన కెరియర్ సూపర్ గా ఉండేది అలా కాకుండా ప్లాప్ సినిమాలు తీసి తన కెరియర్ తానే నాశనం చేసుకున్నాడు.అలాగే కొన్ని టీవీ షోస్ కి జడ్జ్ గా చేస్తూ నవదీప్ జనాలని అలరిస్తున్నారు…ఇదంతా చూస్తున్న సినీ అభిమానులు నవదీప్ హీరో మెటీరియల్ తను హీరో గా ఫోకస్ పెట్టకుండా సైడ్ ట్రాక్ కి వెళ్లిపోయినందుకు ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.








