నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీమంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరుగుతోందని తెలిపారు.ఏదైనా సమస్య ఉంటే జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్న బాలినేని… కోటంరెడ్డి ఇలా మాట్లాడటం సరికాదని వెల్లడించారు.
ఇంచార్జ్ పదవి కావాలని కోటంరెడ్డి తమ్ముడు కోరగా.కోటంరెడ్డితో కలిసి చర్చించుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నారు.
కాగా ప్రభుత్వంపై కోటంరెడ్డి చేసిన ఆరోపణలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.







