తెలుగు చిత్ర పరిశ్రమకు ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా పరిచయమయ్యారు కన్నడ సోయగం ప్రణీత సుభాష్.ఈ సినిమా తర్వాత తెలుగు కన్నడ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే ఈమెకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా ద్వారా తెలుగులో మంచి ఆదరణ లభించింది ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ప్రణీత బెంగళూరుకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.ఇలా పెళ్లి జరిగిన తర్వాత ఈమె కొన్ని నెలల సమయంలోనే గర్భవతి కావడం అలాగే పండంటి బిడ్డకు జన్మనివ్వడం కూడా జరిగింది.
ఇలా తరచూ కూతురుతో కలిసి తన క్యూట్ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకునే ప్రణీత తిరిగి సినిమాలతో బిజీగా మారినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనట్టు సమాచారం.మలయాళంలో హీరో దిలీప్ కుమార్ సినిమాలో ప్రణీత నటించే అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రణీత మాట్లాడుతూ మలయాళ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సినిమాలో తాను ఈగో ఉన్నటువంటి ఒక యువతి పాత్రలో కనిపిస్తానని తెలిపారు.ఇక ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడం తనకు ఒక పెద్ద సవాల్ గా మారిందని ప్రణీత సుభాష్ వెల్లడించారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ ఈ సినిమా షూటింగులు ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన కూతురిని విడిచిపెట్టి, తనకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఈమె తన కూతురు ఆర్నాను మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.