ఈమధ్య కాలంలో బాగా వినబడుతున్న పదం AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్).ఇది ఇప్పుడు ప్రపంచాన్ని ఇది శాసిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.
టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో మనం వాడే ప్రతీదీ డిజిటల్ వస్తువులో రూపంలో మారిపోతుంది.ఇలాంటి తరుణంలో బాగా జనాల నోళ్ళల్లో నానుతున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
నేడు ప్రతీ సాఫ్ట్‌వేర్‌లో దీన్ని విరివిగా వాడుతున్నారు.ఆర్ట్స్, గ్రాఫిక్స్, పెయింటింగ్స్, ఫ్యాంటసీ, సినిమా వంటి ప్రాజెక్టులలో భాగంగా ఈ కృత్రిమ మేథస్సు బాగా ఉపయోగపడుతోంది.
ఈ టెక్నాలజీ సృష్టిస్తున్న ఊహాలోక ప్రపంచాన్ని చూస్తే మతులు పోతాయి అనడంలో అతిశయోక్తి లేదు.

నేడు వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో ఈ కృత్రిమ మేధస్సు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.ఇపుడు సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, ఇంకా మెరుగుపర్చడానికి కృత్రిమ మేధను రూపొందించగల నిపుణులు అవసరం ఎంతైనా వుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అర్ధమయ్యేటట్టు చెప్పాలంటే ఇనుముకు మెదడు, హృదయాన్ని అమర్చడం అన్నమాట.
అమెరికా సైంటిస్ట్ జాన్ మెక్‌కార్తి 1956లోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పదాన్ని సృష్టించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమికంగా కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ.
ఇది సాధారణంగా మానవులకు అవసరమయ్యే పనులను చేయగలదు.

ఐఫోన్ వాడుతున్నవారికి సిరి గురించి పరిచయం చేయవలసిన పనిలేదు.సిరి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పర్సనల్ అసిస్టెంటే అని మీలో ఎంతమందికి తెలుసు? మనిషి తన తెలివిని జోడించి మెషీన్లను తెలివైనవాటిగా మార్చేయవచ్చు.ముందున్నదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగమే అని నిపుణులు చెబుతున్నారు.
జీవితంలో ఇపుడు బాగా ఎదగాలనుకున్నవారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులుల.కృత్రిమ మేధస్సుతోనే విశ్లేషణాత్మక ఆలోచన ప్రక్రియ, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యం వస్తుందని నమ్ముతున్నారు.







