షోలో ముక్కు అవినాష్ పై సీరియస్ అయిన హీరోయిన్ సదా.. వీడియో వైరల్?

ఇటీవల కాలంలో తెలుగు బుల్లితెరపై మొదలయ్యి అతి తక్కువ సమయంలోనే బాగా పాపులారిటీ క్రేజ్ ని సంపాదించుకున్న షోలలో బీబీ జోడీ డాన్స్ షో కూడా ఒకటి.ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లు జంటగా వారి పెర్ఫార్మెన్స్ లతో అదరగొడుతున్న విషయం తెలిసిందే.

 Actress Sadha Serious On Mukku Avinash In Bb Jodi Video Goes Viral ,sadha, Mukku-TeluguStop.com

ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా సీనియర్ హీరోయిన్ రాధ, హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.అయితే బిగ్ బాస్ హౌస్ లో మాటలు, ఆటలతో ఇరగదీసిన సభ్యులు ఇక్కడ డాన్సులతో రెచ్చిపోతున్నారు.

ఒక్కో ఎపిసోడ్ కి ఒక థీమ్ పెట్టుకుని అద్భుతమైన పర్ఫామెన్స్ లను ఇరగదీస్తున్నారు.

వచ్చే శని ఆదివారాల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

ఈ వారం ప్రోమో అంతా డైరెక్టర్స్ స్పెషల్ అంటూ చక్కగా మొదలైంది.ఈసారి సొంత పెర్ఫార్మన్స్ లపై కాకుండా పక్కవాళ్ళ పెర్ఫార్మన్స్ లను జడ్జి చేస్తూ హర్ట్ అయిపోయారు.

వాసంతి, అర్జున్ ల రొమాంటిక్ పెర్ఫార్మన్స్ తర్వాత అందరూ అభినందించారు.

అంతా బాగానే ఉందని అనుకుంటున్న టైంలో ముక్కు అవినాష్ వాసంతి టీమ్ పెర్ఫార్మన్స్ లో డాన్స్ మిస్ అయ్యిందంటూ కామెంట్ చేశాడు.వెంటనే స్పందించిన జడ్జి సదా వాళ్ళు చేసింది డాన్స్ కాదా? అని అవినాష్ పై సీరియస్ అయ్యింది.

అంతేకాకుండా అవినాష్ టీమ్ మెంబర్ అరియానా కూడా వాసంతి టీమ్ పెర్ఫార్మన్స్ పై పాజిటివ్ గానే ఉంది.దీంతో తనకు నచ్చలేదని అవినాష్ మీకు నచ్చినట్లుగా పాయింట్స్ ఇచ్చుకోండి.నెక్స్ట్ నుండి నేను బిబి జోడిలో ఉండను అని కామెంట్ చేశాడు.

ప్రస్తుతం వీరి వాగ్వాదానికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ గా మారింది.అయితే ఇది జస్ట్ ప్రోమో కోసమా లేదంటే నిజంగానే జరిగిందా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.బిగ్బాస్ హౌస్లో మాదిరిగానే ఈ బిబి జోడిలో కూడా కొట్లాటలకు అరుపులకు కొదవలేదు అని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube