మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం హన్మకొండలో ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ అతిథిగా హాజరై సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ రవితేజ గురించి ఎమోషనల్ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ అవుతుందని ముందుగానే ఊహించాము.ఈ సినిమాను ఇంత సక్సెస్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఈ సినిమాలో నటినటుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదట రవితేజ గురించి మాట్లాడాలని చిరు తెలిపారు.రవితేజను చూస్తే నాకు పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తారు.
రవి కూడా నాకు తమ్ముడు లాంటివాడే.అయితే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చనిపోయే సన్నివేశం గురించి ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు.
ఈ సినిమాలో రవితేజ చనిపోయేటప్పుడు చాలా ఎమోషనల్ గా అనిపించింది.ఆ సన్నివేశంలో రవితేజ స్థానంలో నేను పవన్ కళ్యాణ్ ను ఊహించుకున్నాను.ఇలా పవన్ ను ఊహించుకోవడం వల్ల నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి.ఈ సన్నివేశం గ్లిజరిన్ లేకుండా చేశానని అయితే ఈ సన్నివేశం తన మనసును ఎంతగానో కలిసి వేసిందని ఈ సందర్భంగా రవితేజ గురించి చిరంజీవి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.