పఠాన్ సెన్సేషన్.. బాహుబలి, కేజిఎఫ్ రికార్డులు గల్లంతు!

బాలీవుడ్ గత కొన్నాళ్లుగా హిట్ లేక సతమతం అవుతుంది.ఒకవైపు పక్క ఇండస్ట్రీలు అయిన మన సౌత్ భాషలు పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్స్ అందుకుంటూ 1000 కోట్ల ప్రాజెక్టులను మన ఖాతాలో వేసుకుంటుంటే బాలీవుడ్ మాత్రం 100 కోట్ల సినిమాలు కూడా చేయలేక ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే.

 Sharukh Khan Pathaan Box Office Collection Day 3 Details , Pathan, Baahubali, S-TeluguStop.com

మరి అలాంటి సమయంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.

నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Telugu Baahubali, Bollywood, Pathaan Box, Pathaan, Pathan, Shah Rukh Khan, Sharu

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా జనవరి 25న భారీ స్థాయిలో రిలీజ్ అవ్వగా పాజిటివ్ టాక్ వచ్చింది.ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది అని సరైన హిట్ లేక బాధ పడుతున్న షారుఖ్ కు మంచి హిట్ అందింది అని అంటున్నారు.అంతేకాదు ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది.

Telugu Baahubali, Bollywood, Pathaan Box, Pathaan, Pathan, Shah Rukh Khan, Sharu

మొదటి రోజే రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా 300 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.అలాగే ఈ సినిమా ఇండియాలో మూడు రోజుల్లోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచి కేజిఎఫ్ 2, బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసింది.ఇక వీకెండ్ అయిపోయేసరికి ఈ సినిమా 500 కోట్లకు చేరిపోవడం పక్కా అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube