కేవలం తనకున్న భారీ కాయంతో హీరోయిన్ గా నటించి కమీడియన్ గా సెటిలైంది గీత సింగ్. ఆమెకు ఉన్న భారీ కాయం గీత సింగ్ ను ఎన్నో విధాలుగా అవమానాలకు గురిచేసింది దాంతో ఆమె పట్టుబట్టి డ్యాన్స్ నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
ఇక ఈమెలోని మంచి నటిని గుర్తించిన దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ తన సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు ఇస్తూ వచ్చాడు.గీతా సింగ్ నటించిన మొట్టమొదటి సినిమా కితకితలు.
ఈ చిత్రం 2007లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో ఈవీవీ తన కుమారుడైన అల్లరి నరేష్ హీరో కాగా గీతా సింగ్ ని హీరోయిన్.
ఇక అల్లరి నరేష్ కి ఇది ఒక కమర్షియల్ హిట్ గా నిలిచింది.నరేష్ అప్పటికే హీరోగా దాదాపు పది సినిమాలకు పైగా నటించిన కితకితలు మాత్రమే అతన్ని తొలిసారి ఒక సక్సెస్ఫుల్ హీరోగా చేసింది.
ఇక గీతా సింగ్ ఆ తర్వాత నటించిన అనేక సినిమాల్లో అల్లరి నరేష్ హీరోగా ఉన్న ఆమె కమీడియన్ గా కొనసాగింది.అయితే ఒకరోజు షూటింగ్ లో గీతా సింగ్ కి దారుణ అవమానం ఎదురైంది.
ఆ సినిమా షూటింగ్ లో హీరో నరేష్ కూడా ఉన్నాడు కాకా రెడీ అవ్వడానికి గీతా సింగ్ క్యారవాన్ కి వెళ్ళగా ఈవిడ ఎంటి క్యరవాన్ ఎక్కుతుంది అంటూ అక్కడ ఉన్న ముంబై హీరోయిన్స్ ఆమెను అవహేళన చేశారట.అక్కడే ఉన్న గీతా సింగ్ హెయిర్ డ్రెస్సర్ అదేంటి మేడం అంతలా అవమానిస్తున్న సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు అని గీతను ప్రశ్నించిందట.పోనీలే వాళ్లకి మన గురించి తెలీదు అంటూ నవ్వుతూ వెళ్ళిందట.ఈ విషయం మరునాడు అల్లరి నరేష్ కి కూడా తెలిసిందట.సరదాగా ఒకసారి అందరూ కూర్చున్న సమయంలో గీతను పిలిచి
అక్కడున్న వారందరికీ కూడా ఈమె నన్ను సక్సెస్ఫుల్ గా హీరోని చేసింది.నేను నటించి విజయం సాధించిన మొదటి సినిమా లో ఈమనే హీరోయిన్ అంటూ అందరికీ పరిచయం చేశారట.దాంతో అక్కడున్న వారంతా కూడా షాక్ అయ్యి చూస్తూనే ఉన్నారట.అలా గీతా సింగ్ కి జరిగిన అవమానం తెలుసుకొని ఆమెను సెట్ లో అందరూ గౌరవించేలా అల్లరి నరేష్ మాట్లాడటం ఆమెను ఎంతగానో ఎమోషన్ కి గురిచేసిందట.
ఈ విషయాన్ని ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా సింగ్ అభిమానులతో పంచుకున్నారు.