చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
యాత్రలో భాగంగా కురబ, వాల్మీకి సామాజిక భవనాలను లోకేశ్ పరిశీలించారు.
భవన నిర్మాణాలు నిలిచిపోయాయని ఆయన మండిపడ్డారు.అయితే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
భవనాలను పరిశీలించిన అనంతరం లోకేశ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సరైన గుణపాఠం చెప్పాలన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో సామాజిక భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు.







