వామ్మో.. అఖిల్ బాడీ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వైరల్ ఫోటో?

టాలీవుడ్ హీరో, అక్కినేని వారసుడు అఖిల్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.నాగార్జున, అమలల ముద్దులా కొడుకుగా అఖిల్.

 You Have To Be Shocked To See Akhil S Body Viral Photo ,nagarjuna, Amala ,akhil,-TeluguStop.com

చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఆ సమయంలో కేవలం ఒక్క సంవత్సరం వయసులో ఉన్న అతడు.

కనీసం నటన గురించి ఏమాత్రం తెలియని వయసులో నటించి తెలుగు ప్రేక్షకులను ఫిలా చేసాడు.

ఇక ఆ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది.

పైగా ఈతరం ప్రేక్షకులు కూడా ఆ సినిమాను బాగా ఇష్టపడతారు.ఆ తర్వాత విదేశాలలో చదువులు పూర్తి చేసుకొని 2014లో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి రిఎంట్రీ ఇచ్చాడు.2014లో డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన మనం సినిమాలో చివర్లో క్లైమాక్స్ లో మాత్రమే కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.

ఆ తర్వాత 2015 లో అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.

వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది.  నిజానికి తన తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అని అక్కినేని ఫ్యామిలీ అనుకున్నారు.

కానీ తొలి సినిమా అని ఊహించని షాక్ ఇచ్చింది.

Telugu Akhil, Amala, Vikram Kumar, Nagarjuna, Sisindri, Tollywood-Movie

ఆ తర్వాత ఆటాడుకుందాం రా సినిమాలు అతిధి పాత్రలో కూడా చేశాడు అఖిల్.ఇక 2017లో హలో సినిమాలో నటించగా ఈ సినిమా కొంతవరకు పరవాలేదు అన్నట్లుగా టాక్ తెచ్చుకుంది.ఆ తర్వాత మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించగా ఈ సినిమాలు కూడా అఖిల్ ను నిరాశపరిచాయి.

నిజానికి అఖిల్ రీఎంట్రీ తో ఏ ముహూర్తంలో అడుగుపెట్టాడో కానీ అప్పటినుంచి ఈయనకు సక్సెస్ అనేది లేకపోయింది.

దీంతో అప్పటినుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు అఖిల్.

మామూలుగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగుపెడితే వాళ్లకు వెంటనే స్టార్ హోదా అనేది రావాలి.కానీ అఖిల్ కి మాత్రం సరైన సక్సెస్ కూడా లేకపోయింది.

ప్రస్తుతం ఆయన ఖాతాలో ఏజెంట్ సినిమా ఉండగా ఆ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.ఇక అఖిల్ ఆశలు అన్ని ఈ సినిమా పైనే ఉన్నాయి.

ఇక ఈ సినిమా కూడా ప్లాఫ్ అయితే మాత్రం అఖిల్ కు హీరోగా కలిసి రానట్లే అర్థం.

Telugu Akhil, Amala, Vikram Kumar, Nagarjuna, Sisindri, Tollywood-Movie

ఇక అఖిల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.తన ప్రాజెక్టు అప్డేట్ ల గురించి షేర్ చేస్తూ ఉంటాడు.కొన్ని కొన్ని సార్లు తన ఫోటోలు కూడా పంచుకుంటూ ఉంటాడు.

ఇక ఈమధ్య బాగా వర్కౌట్లు చేస్తూ జిమ్ బాడీని సంపాదించుకున్నాడు.మంచి బాడీబిల్డర్ గా కనిపిస్తూ అందరికీ షాకుల మీద షాక్ లు ఇస్తున్నాడు అఖిల్.

ఒకప్పుడు సన్నగా ఉండే ఇతడు ఇప్పుడు ఇలా మారటంతో అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు.తాజాగా అటువంటిదే ఒక ఫోటో పంపించగా ఆ ఫోటోలో మాత్రం అఖిల్ ని చూసి ఫిదా అవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి.

జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కనిపించగా.ప్రస్తుతం ఆ ఫోటో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube