32 ఏళ్ళ తరువాత అక్కడ హౌస్ ఫుల్ బోర్డు.. రికార్డులు సృష్టిస్తున్న పఠాన్?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కలిసి నటించిన తాజా చిత్రం పఠాన్.ఇటీవల జనవరి 25వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.అంతేకాకుండా చాలా గ్యాప్ తర్వాత షారుక్ ఖాన్ మరొక హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.షారుక్ ఖాన్ నుంచి నాలుగేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Pathaan Create A New Record In Kashmir, Pathanna Movie, Bollywood, Shah Rukh Kha-TeluguStop.com
Telugu Bollywood, Kashmir, Pathanna, Shah Rukh Khan-Movie

అంచనాలకు తగ్గట్టుగా విడుదలైన ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగానే కలెక్షన్స్ను రాబడుతూ దూసుకుపోతోంది.ఈ సినిమా విడుదల రెండు రోజుల్లోనే దాదాపుగా రూ.220 కోట్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది.అదేమిటంటే కశ్మీర్ లోయలోని థియేటర్ సంగతి చూస్తే అక్కడి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రేక్షకులతో నిండి పోయింది.

దాంతో థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టారు.ఈ మేరకు ఆఫ్ అందుకు సంబంధించిన ఫోటోని థియేటర్ యాజమాన్యం సోషల్ మీడియాలో పంచుకుంటూ తొలి రోజున థియేటర్లోని అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి అని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Telugu Bollywood, Kashmir, Pathanna, Shah Rukh Khan-Movie

అయితే కశ్మీర్ లోని ఒక థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు పెట్టి దాదాపుగా 32 ఏళ్ళు అయ్యిందట.రెండేళ్ల తర్వాత ఈ పటాన్ సినిమాతో మళ్లీ హౌస్ ఫుల్ బోర్డు దర్శనమిచ్చింది.అయితే సినిమా విడుదలకు ముందు పలు రకాల కాంట్రవర్సీలను ఎదుర్కొన్న పఠాన్ మూవీ ప్రస్తుతం రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది.అయితే అభిమాన హీరో షారుఖ్ ఖాన్ నుంచి దాదాపు నాలుగేళ్ల తర్వాత సినిమా రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube