టీడీపీ నేత నారా లోకేశ్ చేయాల్సింది పాదయాత్ర కాదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.తన తండ్రి చంద్రబాబు చేసిన మోసాలపై పాప పరిహార యాత్ర చేయాలన్నారు.
బాబు వయసు పైబడటంతో లోకేశ్ ను చివరి అస్త్రంగా ప్రయోగిస్తున్నారని విమర్శించారు.లోకేశ్ కు ప్రజా సంబంధాలు లేవని చెప్పారు.
లోకేశ్ పాదయాత్రతో తమకు ఎలాంటి భయం లేదని తెలిపారు.సంక్షేమ పథకాలే మన ధైర్యమని తమకు జగన్ చెప్పారని పేర్కొన్నారు.
ఏపీలో ఎక్కడా ప్రజా సమస్యలు లేవన్న మంత్రి కాకాణి చంద్రబాబుకు భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.







